అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు (Illegal cases ) బనాయిస్తు న్నారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ( Karunakar Reddy ) ఆరోపించారు. లేని లిక్కర్ స్కాంను సృష్టించి వైసీపీ నాయకులను, అధికారులను అరెస్టు చేశారని అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్‌తో కలిశారు. ఈ సందర్భంగా జైలు బయట వారు మాట్లాడారు.
అక్రమ కేసులు పెడుతూ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వాన్ని నిలదీస్తునే ఉంటామని వెల్లడించారు. మిథున్ రెడ్డి మానసికంగా ధైర్యంగా ఉన్నారని, వైసీపీ శ్రేణులు భయపడేది లేదని అన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలనే లక్ష్యాన్ని ఏపీ పోలీసులు మరిచిపోయారని విమర్శించారు.