Vinesh Phogat | మళ్లీ కుస్తీ పట్టనున్న వినేశ్.. ఆసియా క్రీడల ట్రయల్స్‌కు అనుమతించిన హైకోర్టు..!
Vinesh Phogat : భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)తో పోరాడుతున్న వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పునరాగమనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆసియా క్రీడల(Asian Games) ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది.
Vinesh Phogat : భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)తో పోరాడుతున్న వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పునరాగమనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆసియా క్రీడల (Asian Games) ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. తల్లైన రెజర్ల విషయంలో డబ్ల్యూఎఫ్ఐ నిబంధనలు అనుచితంగా ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం వినేశ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పునిచ్చింది. దాంతో.. ఆమెను అడుగడుగునా అడ్డుకోవాలని చూసిన బ్రిజ్ భూషణ్ గ్యాంగ్‌కు హైకోర్టు నిర్ణయం చెంపపెట్టు కానుంది.
ఆసియా క్రీడలతో పునరాగనం చేయాలనుకున్న వినేశ్ ఫొగాట్ కల నిజమవ్వనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య నిబంధనలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అనుమతి లభించింది. ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ద్విసభ్య బెంచ్.. వినేశ్‌ను ఆసియా క్రీడల ట్రయల్స్‌లో పాల్గొనేందుకు అనుమతించింది. ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని రెజ్లింగ్ సమాఖ్యను కోర్టు ఆదేశించింది. భారత స్పోర్ట్స్ అథారిటీ, భారత ఒలంపిక్ సంఘానికి చెందిన స్వతంత్ర ప్రతినిధులు ట్రయల్స్‌ను పర్యవేక్షించనున్నారు. మే 30 నుంచి 31 తేదీల్లో ట్రయల్స్ జరుగనున్నాయి.
Necessary that Vinesh Phogat permitted to participate in Asian Games trials in interest of sport and justice: Delhi High Court.
WFI’s selection policy exclusionary for lack of discretion to consider iconic players like Phogat who is returning from maternity break: HC.
Asian… pic.twitter.com/M5lN0nzwJz
— Press Trust of India (@PTI_News) May 23, 2026
‘మే 30, 31వ తేదీల్లో జరుగబోయే ఆసియా క్రీడల ఎంపిక పోటీల్లో వినేశ్ ఫొగాట్ పాల్గొనేందుకు అనుమతిస్తున్నాం. ప్రముఖులైన క్రీడాకారిణులపై ప్రసూతి సెలవుల తీసుకున్నారనే నెపంతో ప్రతీకార చర్యలకు దిగడం సహేతుకం కాదు. వినేశ్‌కు పంపిన షోకాజ్ నోటీసు కూడా ఇదివరకే ముగిసిన విషయం గురించినది. కాబట్టి.. వినేశ్‌ను పోటీపడేందుకు అనుమతించడం అత్యవసరం. అటు క్రీడలు, ఇటు న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ద్విసభ్య బెంచ్ పేర్కొంది.
[BREAKING] Delhi High Court allows Vinesh Phogat to participate in Asian Games trials; terms WFI action vindictive
report by @prashantjha996 https://t.co/LDAR3KN0Nk
— Bar and Bench (@barandbench) May 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

