Save the Tigers 3 | ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’ టీంలో వెన్నెల కిశోర్.. హైప్ పెంచేస్తున్న నయా పోస్టర్
Save the Tigers 3 | మహి వి రాఘవ్ (Mahi V Raghav) డైరెక్ట్ చేసిన పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers). ఇప్పటికే సీజన్ 1, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ షోలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ప్రాంచైజీలో సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి కూడా రాబోతుందని తెలిసిందే.
Save the Tigers 3 | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని డైరెక్టర్ మహి వి రాఘవ్. ఓ వైపు సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మరోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా ఎంటర్టైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ప్రదీప్ అద్వైతం రచనలో మహి వి రాఘవ్ (Mahi V Raghav) డైరెక్ట్ చేసిన పాపులర్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్(Save the Tigers). ఇప్పటికే సీజన్ 1, సేవ్ ది టైగర్స్ సీజన్ 2 వెబ్ షోలు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ ప్రాంచైజీలో సేవ్ ది టైగర్స్ సీజన్ 3కి కూడా రాబోతుందని తెలిసిందే.
జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎక్జయిటింగ్ అప్డేట్ రానే వచ్చింది. మహి వి రాఘవ్ టీం నయా పోస్టర్ విడుదల చేసింది. మూడింతల వినోదంతోపాటు మూడు రెట్ల అయోమయం, మూడింతల మోత మోగించేందుకు టైగర్స్ మళ్లీ వస్తున్నాయి.. సేవ్ ది టైగర్స్ 3 జియోహాట్ స్టార్‌లో సందడి చేయనుందని తెలియజేశారు మేకర్స్.
రెండు సీజన్లలో ఇప్పటికే ప్రియదర్శి-జోర్దార్ సుజాత, కృష్ణచైతన్య, దేవియాని శర్మ, అభినవ్ గోమటం-పావన్ గంగిరెడ్డి క్రేజీ కామిక్ అండ్ సీరియస్ టచ్ ఉన్న రోల్స్ ఎంటర్ టైన్ చేయగా.. వీరంతా సీజన్ 3లో కూడా మళ్లీ సందడి చేయనున్నారు. అయితే సూపర్ కామిక్ టైమింగ్‌తో అదరగొట్టే వెన్నెల కిశోర్ సీజన్ 3లో జాయిన్ అయ్యాడు. తాజా పోస్టర్ చూస్తుంటే వెన్నెల కిశోర్ సేవ్ ది టైగర్స్ టీంకు మధ్య నారథుడిలా ఉండబోతున్నాడని డైరెక్టర్ హింట్ ఇచ్చేశాడా..? అని చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్. ప్రదీప్ అద్వైతం, మహి వీ రాఘవ్ క్రియేషన్‌లో రాబోతున్న సీజన్ 3ని శ్రీరామ్ ఎరగం డైరెక్ట్ చేస్తుండగా.. అజయ్ అరసాడ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ సిరీస్ యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అందరికీ కనెక్ట్ అవుతూ.. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సేవ్ ది టైగర్స్ ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో నిలవడం విశేషం.
Brace yourself for 3X Fun, 3X Chaos & 3X Frustration! 🌪️
Because the TIGERS are back with a BANG 🐯❤️🔥#SaveTheTigers3 coming soon on JioHotstar! 💫#SaveTheTigers3OnJioHotstar pic.twitter.com/EfaKQbCXJO
— BA Raju’s Team (@baraju_SuperHit) May 23, 2026
Read Also :
TG Polycet 2026 | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
Karuppu |‘కరుప్పు’ బాక్సాఫీస్ దూకుడు.. తమిళనాడులో మరో రూ.100 కోట్ల మూవీ..
Swimming Competition: సమ్మర్ కాంపిటీషన్లో యువ స్విమ్మర్ నిత్య ప్రియకు మెడల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

