అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు(Chandra Babu) కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ఆపాలని వైసీపీ నాయకుడు(YCP Leader) , మాజీ ప్రభుత్వ విప్ ఉదయభాను( Uday Bhanu) డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాటి నుంచి మొదలైన దాడులు, అక్రమ కేసులు అప్రతిహతంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.
అధికారంలో ఉన్నమని, తమను ఎవరూ ఏమి చేయాలేరన్న ధీమాతో టీడీపీ నాయకులు, శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లను కట్టించిన వీరయ్య అనే కార్యకర్తను 2009లో ఆనాడు టీడీపీ నాయకులు హతమార్చారని, నేడు అతడి కొడుకు గింజుపల్లి శ్రీనివాసరావును చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన రతువా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ సోదరుడి రౌడీయిజం ఎక్కువై పోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి దాడులను నిలువరించాలని, దాడులకు పాల్పడిన వారిపై పీడీయాక్ట్ నమోదు చేయాలని కోరారు. రాష్ట్రంలో అనేక సంఘటనల్లో కనీసం ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయడం లేదని పేర్కొన్నారు.