అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈవో కే జవహర్‌రెడ్డిని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయన టీటీడీ ఈవోగాను కొనసాగుతారని పేర్కొంది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్, సీసీఎల్‌గా జీ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ నియామకమయ్యారు.
రవాణాశాఖ కమిషనర్‌గా ఎంటీ కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్, క్రీడలు, యువజన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్ భార్గవకు అదనపు బాధ్యతలు, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాబు.ఎకు పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఐపీఎస్ అధికారి పీ సీతారామాంజనేయులుకు ఏపీపీఎస్సీ కార్యదర్శి నుంచి రిలీవ్ చేసింది. ఏసీబీ డీజీగా కే రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంటిలిజెన్స్ డీజీగా రామాంజనేయులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా భరత్ బక్చిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.