Chandrababu | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి గప్పాలు చెప్పుకున్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడంలో చాలా కష్టపడ్డానని చె ప్పుకొచ్చారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వేదికగా జరిగిన సౌత్ఏషియా లెర్నింగ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఐఎస్బీని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డా.
శంషాబాద్ విమానాశ్రయం కో సం ఐదు వేల ఎకరాల భూసేకరణ చేశా. నల్సార్, ట్రిపుల్ ఐటీ, వంటి సంస్థలను సైతం మేమే ఏర్పాటు చేశాం. కేవలం తొమ్మిది నెలల్లో కృష్ణా నది నీటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించాను’ అని చెప్పారు. బిల్‌గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో కార్యాలయం పెట్టేలా ఒప్పించానని చెప్పుకున్నారు.