Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వీరిద్దరి భేటీ జరిగింది. దాదాపు రెండు గంటలపాటు వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో హైడ్రా వంటి ఒక వ్యవస్థ మంచిదే అని గతంలో పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా వంటి వ్యవస్థ ఏం చేయాలనేదానిపై చర్చిస్తామని కూడా అప్పట్లో తెలిపారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పవన్ కల్యాణ్ భేటీ అవ్వడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.