Indigo Flight | ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్టులో రెండు విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. అసోం నుంచి హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ రెండో విమానాలను గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు.
హైదరాబాద్కు బదులు గన్నవరంలో విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే తిరిగి ప్రయాణం ప్రారంభిస్తామని ప్రయాణికులకు ఎయిర్లైన్స్ సిబ్బంది సమాచారం అందించారు.