హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గుండె ఆపరేషన్ కోసం ఏపీలో గ్రీన్‌చానెల్ ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్లో, అక్కడి నుంచి తిరుపతికి విమానంలో తరలించారు. శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ మెడికల్ కాలేజీలో అవయవదానంలో భాగంగా సేకరించిన గుండెను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి చొరవ తో అధికారులు 20నిమిషాల్లోనే హెలికాప్టర్ లో వైజాగ్‌కు తరలించారు.
అక్కడి నుంచి తిరుపతికి విమానంలో తీసుకొచ్చి.. ఎయిర్పోర్ట్ నుంచి గుండెను గ్రీన్‌చానల్ ద్వారా పద్మావతి దవాఖానకు తరలించారు. ఈ గుండెను హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఎన్జీవో కాలనీకి చెందిన బాలిక లహరి(11)కి వైద్యులు అమర్చనున్నారు. నవంబర్ 6న తిరుపతిలోని చిల్డ్రన్ హార్ట్‌కేర్ సెంటర్లో తన కూతురిని చేర్పించినట్టు ఆమె తండ్రి సత్యనారాయణ తెలిపారు.