అమరావతి: పొరుగింట్లో ఉండే మహిళపై భర్త అత్యాచారం చేయగా, ఆ నేరాన్ని అడ్డుకోవాల్సిన భార్య మొబైల్లో వీడియో తీసింది. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉండే ఓ వివాహిత ఈ నెల 3వ తేదీ రాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా…ఇంటి పక్కనే నివసిస్తున్న దిలీప్, తులసి దంపతులు రాత్రి సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి మహిళను తమ ఇంట్లోకి లాక్కెళ్లారు.
అనంతరం భర్త దిలీప్ ఆ మహిళపై రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడగా.. భార్య తులసి వీడియో తీసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే పిల్లలను చంపేస్తామని దిలీప్, తులసి దంపతులు బాధితురాలిని బెదిరించారు. బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా..376(2), 354B, 354D, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.