Husband killing wife | ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త భార్యను హతమార్చి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాపేశ్వరానికి చెందిన మట్టపర్తి నాగబాబు(25)కు వేమగిరితోటకు చెందిన కుమారి(21)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. నాగబాబు చక్రద్వారాబంధంలోని బీరువాలో కంపెనీలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరికి సంతానం లేకపోవడంతో కొద్ది రోజులుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో కుమారి తన అక్క వివాహానికి భర్తతో కలిసి వెళ్లింది. వివాహ అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన దంపతులు ఎంతకు తలుపు తీయకపోవడంతో స్థానికులు వచ్చి తలుపులుకొట్టగా గొంతుకు గాయంతో నాగబాబు తలుపు తెరిచాడు. కుమారి అప్పటికే విగతజీవిగా పడి ఉంది. వెంటనే దంపతులిద్దరిని స్థానికంగా ఉండే ప్రైవేట్ దవాఖానకు తరలించాగా కుమారి అప్పటికే చనిపోగా నాగబాబు కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.