Srisailam | శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ హౌస్లో బుధవారం భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ఏడో నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు శబ్దం వినిపించడంతో విధుల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. కాగా, సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లో అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.