Nambala Keshava Rao | ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందిన విషయం విధితమే. ఇందులో నంబాల కేశవరావు సైతం ఉన్నారు. ఆయనపై రూ.1.5కోట్ల రివార్డు ఉందని పేర్కొన్నారు.
ఆయన స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేట. 1995లో జన్మించారు. ఆయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. కేశవరావుకు సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. కేశవరావు ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే కొనసాగింది. తాతగారి ఊరు టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరారు. ఇంటర్ రెండో సంవత్సరం డిగ్రీ చదువుతుండగా వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో సీటు వచ్చింది. భారతీయ మావోయిస్ట్ రాజకీయవేత్తగా ఆయన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU), ఆర్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ అనే రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో కేశవరావును అరెస్ట్ అయ్యారు.
ఇంజినీరింగ్ చదువుతూ పీపుల్స్‌వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. 1987 బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ పొందారు. ఆయనకు గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడు. 2019 గడ్చిరౌలిలో 15 మంది పోలీసుల మృతి నంబాల సూత్రధారి. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత తన పేరును బసవరాజ్‌గా మార్చుకున్నారు. ఆయన 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి. విశాఖ మావోయిస్ట్ పార్టీలో పని చేశారు. పీపుల్స్‌వార్ వ్యవస్థాపకుల్లో కేశవరావు సైతం ఒకరు. మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగాను పని చేశారు.