అమరావతి : ఏపీలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident) లో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారి గాదాంకి వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ( Auto ) ఢీకొనడంతో ఆటోలో ఉన్న ముగ్గురు చనిపోగా మరో 8 మందికి గాయాలయ్యాయి. పెళ్లికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి ఆటోలో తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లెకు చెందిన మాధవి, మేఘన, రాజశేఖర్గా గుర్తించారు. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.