Home
Andhrapradesh-news
Horrific Road Accident In Ap Lorry Rams Into Auto Rickshaw Heading To A Wedding Four Dead
Road Accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్లికి వెళ్తున్న ఆటోను ఢీ కొన్న లారీ.. నలుగురు మృతి
Road Accident | ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
అమరావతి : ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మార్కాపురం( Markapuram ) జిల్లా గిద్దలూరు నల్లబండకు చెందిన 14 మంది బంధువులు కంభంలో పెళ్లికి ఆటోలో వెళ్తుండగా రోడ్డుపక్కన ఆలయంలో పూజ కోసం ఆటోను నిలిపారు.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీ కొట్టడంతో అంకాలు (22), నగేశ్ (18), అలకనంద (18) అనే ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా, చిన్నారి నాగలక్ష్మి( 4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఏడుగురికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది .
ఈ ప్రమాదంలో పెళ్లికుమార్తె వీరక్క స్వల్ప గాయాలతో బయటపడింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వివాహ కార్యక్రమానికి కొన్ని గంటల ముందే ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

