అమరావతి : ఏపీలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు దుర్మరణం చెందారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నుంచి సీతంపేట వెళ్లే ఘాట్రోడ్లో ఆటో బోల్తా (Auto Overturn) పడింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయలయ్యాయి.
బాధితులను పాలకొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు. మృతులంతా సీతంపేట ఏజెన్సీకి చెందిన గిరిజనులని బాధితులు తెలిపారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.