అమరావతి : ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య, మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదఘటన నరసారావుపేట( Narasaraopeta ) లాడ్జీలో జరిగింది . నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన గోపి ( Gopi ) , భార్య శంకరకుమారి( 30 ) భార్య భర్తలు. వీరికి మూడేళ్ల చిన్నారి మౌనిక ఉంది.
వీరు భోపాల్ ఎయిమ్స్ ఆస్పత్రి ( Bhopal AIIMS Hospital ) లో గోపి వైద్యుడిగా , శంకరకుమారి నర్సుగా పనిచేస్తున్నారు. రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేట వచ్చిన గోపీ కుటుంబం లాడ్జీలో దిగారు. ఆదివారం గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జీ సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా తల్లి, కుమార్తె మృతి చెంది ఉండడం, భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితి విషమంగా ఉన్న గోపిని ఆసుపత్రికి తరలించారు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఆత్మాహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.