అమరావతి : వైఎస్ జగన్ ఏపీలో పర్యటించటప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ వివిధ జిల్లాల్లో పర్యటించేటప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. కనీస విచక్షణ లేకుండా ఇష్టాను సారం వెళ్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాగా, మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎస్ రవి వర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణ చేయొద్దని పోలీసులు జగి రమేష్‌కు ముందే నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల సూచనలు ఉల్లంఘిస్తూ భరీ జన సమీకరణతో బైక్ ర్యాలీ తీయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగింరని అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు.