అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లలో 85 మంది నిందితులపై హిస్టరీ షీట్ తెరిచామని డీజీపీ(DGP) హరీశ్కుమార్గుప్తా (Harish Kumar Gupta) వెల్లడించారు. ముగ్గురిపై పీడీ యాక్టు, మరో ఇద్దరు బహిష్కరణకు సిఫార్సు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రోజు నమోదైన కేసులో 1, 522 మందిని గుర్తించామని, ఎన్నికల రోజు నమోదైన కేసులో 2,790 మందిని గుర్తించామని అన్నారు. ఎన్నికల అనంతరం నమోదైన కేసులో 356 మందిని గుర్తించామని డీజీపీ తెలిపారు. కొందరిని అరెస్టు చేశామని, మరికొందరికి 41 ఏ సీఆర్సీ నోటీసులిచ్చామని ఆయన పేర్కొన్నారు.