Tirupati | తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్యప్రమాణాలు : టీటీడీ ఈవో
Tirupati | బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అన్నారు.
తిరుపతి : బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు (Medical Standards) అమలవుతున్నాయని టీటీడీ ఈవో జె.శ్యామలరావు (EO Shyamala Rao ) అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్థోపెడిక్స్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడికి వచ్చి మెరుగైన చికిత్సలు పొందాలని కోరారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి తిరుపతి(Tirupati) లోని బర్డ్ ఆసుపత్రిని (Bird Hospital) సందర్శించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. రోగులకు ఓపి, ఆపరేషన్లు, కృత్రిమ అవయవాల అమరిక వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోకీలు మార్పిడి, తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు. అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర వార్డు, జనరల్ వార్డు, ఎక్సరే, స్కానింగ్, ఓపి వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, అన్నప్రసాదాల నాణ్యత గురించి రోగులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బర్డ్ వైద్యులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బర్డ్ లో అందిస్తున్న వైద్య సేవలను ఈవోకు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

