అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ మాజీ జడ్జి, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విజయవాడ ధర్నా చౌక్‌లో దీక్ష చేపట్టారు. నవరత్నాలకు సబ్‌ప్లాన్ నిధులను బదిలీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించడం చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు.
మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావ్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగనును గెలిపించేందుకు గతంలో తాను రాష్ట్రం అంత పర్యటించనని, ఇక దించడానికి తిరుగుతానని వెల్లడించారు. మూడు ఏడేండ్ల ముఖ్యమంత్రి పాలనలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను కూడా ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని ఆయన వివరించారు. ప్రభుత్వం ఇకనైన తమ విధానాలను మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.