Tirumala | తిరుమల (Tirumala) కొండపై సోమవారం ఉదయం ఓ హెలికాప్టర్ (Helicopter) చక్కర్లు కొట్టింది. శ్రీవారి ఆలయానికి సమీపం నుంచే హెలికాప్టర్ వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం.. తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొండపై చాలా సార్లు విమానాలు, హెలికాప్టర్లు ఎగిరిన ఘటనలు ఇటీవలే అనేకం వెలుగు చూశాయి.
తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనేదానిపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమల కొండపై హెలికాప్టర్ వెళ్లడంపై ఏవియేషన్ అధికారులకు టిటిడే అధికారులు ఫిర్యాదు చేశారు.
Also Read..
Karwa Chauth | తొలిసారి కర్వాచౌత్ వేడుకల్లో మెరిసిన రకుల్ ప్రీత్ జంట.. ఫొటోలు వైరల్
Naim Qassem | ప్రాణ భయంతో.. ఇరాన్ పారిపోయిన హెజ్బొల్లా డిప్యూటీ చీఫ్