అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఏర్పడ్డ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు(Tamilnadu) తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతానికి చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో నవంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో భారీ వర్షాలు (Heavy rains ) కురుస్తాయని వివరించారు.
12వ తేదీన ఏపీలోని దక్షిణ కోస్తా (South Coast) , రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అల్పపీడన ప్రాంతం తుఫానుగా పరిణామం చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదివారం అనకాపల్లి, విశాఖపట్నం,కాకినాడ, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.