అమరావతి : కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయి శిలాతోరణం (Shilatoranam) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 75, 872 మంది భక్తులు దర్శించుకోగా 37,236 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.64 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు
చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడు దర్శనం
అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రెండో రోజు స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మోహన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనసేవ జరుగనుంది. వాహనసేవలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.