Kasibugga | కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటపై ఆలయ నిర్వహకుడు, ధర్మకర్త హరికుముంద్ పండా స్పందించారు. ఆలయానికి సాధారణంగా రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు వస్తుంటారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అస్సలు ఊహించలేదని ఆయన తెలిపారు. ఇంతమంది వస్తారని తెలియక పోలీసులకు కూడా సమాచారం అందివ్వలేదని వివరించారు.
ఈ ఘటన గురించి తెలియగానే హరిముకుంద్ పండాతో కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. అనంతరం బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. ప్రస్తుతం ఆలయ పరిసరాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం విషయానికొస్తే దీన్ని ఒడిశా రాజ కుటుంబానికి హరిముకుంద్ పాండా నిర్మించారు. ఒకసారి తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు శ్రీవారి దర్శనం అనుకున్నంత సాఫీగా జరగలేదు. దీంతో తానే స్వయంగా వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే కాశీబుగ్గలో తనకు వందెకరాల భూమి ఉండగా, అందులో 12 ఏకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. మే నెల నుంచే ఈ ఆలయంలో దర్శనాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఈ ఆలయం గురించి సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆలయానికి ప్రతి రోజు దాదాపు వెయ్యి మంది వరకు భక్తులు వస్తున్నారని సమాచారం. ఈ ఆలయం సామర్థ్యం కూడా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25 వేల మంది భక్తులు వచ్చారు. దీంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించారు.
#Kasibugga #Srikakulam #Stampede
కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఇలాంటి ప్రమాద ఘటనల్లో కూడా సెకండ్ల వ్యవధిలో సానుభూతి, సహాయక చర్యలకంటే, శవ రాజకీయాలు చేసే రాబందుల పార్టీ మన రాష్ట్రంలో ఉండటం, ఇంకా దురదృష్టం.ఈ ఆలయం పూర్తిగా ఒడిశా రాజ కుటుంబం నిర్వహణలో… https://t.co/HC4L3x6e9u pic.twitter.com/EYJETXPJ4i
— Telugu Desam Party (@JaiTDP) November 1, 2025