నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు వాసుదేవరెడ్డి, రాజ్ భాస్కరరెడ్డి, అనిల్‌కుమార్‌ను 7రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈడీ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ మేరకు కౌంటర్లు దాఖలు చేయాలని ఈడీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
ఈ కేసులో కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నదని, రూ.196.33 కోట్లు ప్రభుత్వానికి గండిపడిందని ఈడీ అధికారులు గురించారు. మద్యం రవాణా పాలసీ విధానంపై పూర్తిస్థాయి సాక్ష్యాధారాలు సేకరించాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో కీలక పత్రాలు, టెండర్ల వివరాలను రాబట్టాల్సి ఉన్నదని తెలిపారు. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ఈడీ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.