Vijayasai Reddy | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డికి జీవీఎంసీ షాకిచ్చింది. విశాఖ జిల్లా భీమిలిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతను జీవీఎంసీ అధికారులు మొదలుపెట్టారు.
భీమిలి బీచ్ వద్ద సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లోని స్థలంలో సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణాన్ని నేహారెడ్డి చేపట్టారు. ఇవి అక్రమ కట్టడాలంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేహా రెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని.. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు.
విశాఖ: భీమిలి బీచ్ వద్ద వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు.#Ysrcp #VijaysaiReddy #Visakhapatnam #BheemiliBeach #AndhraPradesh #NewsUpdates #Bigtv @YSRCParty @ysjagan @VSReddy_MP pic.twitter.com/TqzlQxofhF
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2024