AP News | రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు పట్టించుకోలేదు. మాకేం సంబంధమంటూ చూసి చూడనట్టుగా పక్క నుంచే వెళ్లిపోయారు. ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణంపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కూరగల్లు ఓ బైకర్.. టిప్పర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు. ఆ వెంటనే అతనిపై నుంచి టిప్పర్ లారీ రెండు చక్రాలు వెళ్లిపోయాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బైకర్ కొనఊపిరితో అక్కడే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనాలు అది తామకేమీ పట్టదన్నట్లుగా ఉండిపోయారు. దగ్గరికి వెళ్లి సాయం చేయడమేమో కానీ.. కనీసం 108 అంబులెన్స్‌కు కాల్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. నిండు ప్రాణం పోతుంటే మాకేం సంబంధం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అక్కడే విలవిల్లాడుతూ బైకర్ ప్రాణాలు విడిచాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు అక్కడ ఉన్నవారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణం పోతున్నా సమాజం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడ ఎవరూ పట్టించుకోరు.. ఎవరూ బాధ్యత తీసుకోరు.. ఎందుకంటే ఇది భారతదేశం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమాజంలో మానవత్వం చచ్చిపోయిందని అంటూ ఆవేదన చెందుతున్నారు.
మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం
గుంటూరు జిల్లా కూరగల్లులో ఓవర్ టేక్ చేస్తూ లారీ కింద పడ్డ బైకర్
బైకర్ తలపై నుండి దూసుకెళ్లిన లారీ రెండు టైర్లు
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా చూస్తూ ఉన్నారే కానీ పట్టించుకొని జనం
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలిన బైకర్ pic.twitter.com/iBnPHob4QX
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2025