CPI | సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడు పర్యాయాలు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. దీంతో పార్టీ నిబంధనల ప్రకారం కొత్త కార్యదర్శిని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ముప్పాళ్ల నాగేశ్వరరావు మధ్య పోటీ పడ్డారు. చివరకు ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గుజ్జుల ఈశ్వరయ్య విషయానికొస్తే ఆయనది వైఎస్ఆర్ కడప జిల్లా. బీసీ వర్గానికి చెందిన ఆయన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పనిచేశారు. ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కడప నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు.