అమరావతి : ఏపీలో గత వారంరోజులుగా ఆయా జిల్లాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించిన వైసీపీ (YCP) అధిష్టానం గురువారం మరో నాలుగు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ ప్రకటనను విడుదల చేసింది. విశాఖ (Visaka) జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) ను నియమించింది.
అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ముత్యాలనాయుడు, అల్లూరి జిల్లా అధ్యక్షుడిగా విశ్వేశ్వరరాజు, బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జునను నియమించినట్లు తెలిపింది. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా సురేష్, పార్టీ పీఏసీ మెంబర్గా ఆదిమూలపు సురేష్, విశాఖ వెస్ట్ సమన్వయకర్తగా విజయప్రసాద్, వైసీపీ ఎస్టీ విభాగం అధ్యక్షురాలిగా భాగ్యలక్ష్మిని నియమించింది .