AP News | కదులుతున్న రైలు ఇంజిన్‌పై దుండగుల రాళ్ల దాడి.. లోకోపైలట్‌కు తీవ్రగాయాలు
AP News | ఏపీలో దుండగులు రెచ్చిపోయారు. గురువారం తెల్లవారుజామున కదులుతున్న రైలు ఇంజిన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విజయవాడకు చెందిన లోకోపైలట్ జయరామ్ తీవ్రంగా గాయపడ్డాడు.
AP News | ఏపీలో దుండగులు రెచ్చిపోయారు. గురువారం తెల్లవారుజామున కదులుతున్న రైలు ఇంజిన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రైలు ముందు భాగంలోని అద్దం పగిలి, విజయవాడకు చెందిన లోకో పైలట్ జయరామ్‌కు తగిలింది. దీంతో జయరామ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ (12616) రైలు ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తుండగా సింగరాయకొండ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దాడి అనంతరం ప్రథమ చికిత్స కోసం రైలును ఉలవపాడు రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. గాయపడిన ఉద్యోగిని రైల్వే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జయరామ్ పరిస్థితి స్థిరంగా ఉందని.. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, బాధితుడిని రైల్వే అధికారులు, కార్మిక సంఘ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలో కదిలే రైలు ఇంజన్‌పై రాళ్ల దాడి చేసిన దుండగులు
ఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలుపై సింగరాయకొండ సమీపంలో రాళ్ల దాడి
దాడిలో తీవ్రంగా గాయపడిన సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరామ్
సమీపంలోని Upd స్టేషన్లో రైలు ఆపి, గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించిన అధికారులు pic.twitter.com/XiciPjSSPH
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

