తెలంగాణకు మరోసారి మొండి చెయ్యి.. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ..
అమరావతి : తెలంగాణకు కేంద్రం మరోసారి మొండి చెయ్యి చూపింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని ఎంత కోరినా కేంద్రం స్పందించలేదు. పైగా, మీ నెలకొల్పేందుకు ఎవైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటూ జగన్ సర్కార్‌ను అడిగింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణతోపాటు తమిళనాడు రాష్ట్రం కూడా పోటీ పడింది. చివరకు ఈ పార్క్ ఏపీలోని కాకినాడ జిల్లాలో ఏర్పాటుకానున్నది.
ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలపాల్సిందిగా కోరుతూ కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది. బల్క్ డ్రగ్ పార్క్‌కు సంబంధంచి డీపీఆర్‌ను 90 రోజుల్లోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ బల్క్ డ్రగ్ పార్క్‌ను కాకినాడ జిల్లా పరిధిలోని తొండంగి మండలం కేపీపురం- కోదాడ గ్రామాల మధ్య ఏర్పాటు కానున్నది.
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగం నుంచి బల్క్ డ్రగ్ పార్క్‌కు సంబంధించి ఏపీ చీఫ్ సెక్రటరీకి ఈ మేరకు గురువారం లేఖ అందింది. వారం రోజుల్లోగా ఈ పార్క్ ను చేపట్టేందుకు సమ్మతి తెలుపుతూ లేఖ పంపాలని కోరింది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే చివరకు అది ఏపీకి దక్కింది. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా వేల సంఖ్యలో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

