తిరుపతి : తిరుపతి (Tirupati ) కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారి చండీయాగం (Chandi Yagam ) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీకమాసం సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న విశేషపూజ, హోమ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం యాగశాలలో పూజ, నిత్యహోమం, చండీహోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు.
సాయంత్రం హోమం, చండీపారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టారు. గృహస్తులు రూ.500 టికెట్‌తో ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.