తిరుపతి : ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి (Ontimitta Kodandaramundu) శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ( Brahmotsavams ) భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని (Grand chariot) లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. కాగా నిన్న రాత్ని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై సీతారాములు భక్తులకు దర్శనమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. వాహన సేవలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.