(Talli bidda Services) అమరావతి: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 270 వాహనాలు నడుస్తుండగా.. ఆ సంఖ్యను 500 కు పెంచేందుకు జగన్ సర్కార్ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల నుంచే 500 సర్వీసులతో సేవలను నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నది. అలాగే, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అనంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు మాటర్నల్ అండ్ చైల్డ్ ఎక్స్‌ప్రెస్.. 102 సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ సేవలను మరింత విస్తరించేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం 270 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు.. ప్రసవం తర్వాత తల్లి, శిశువులను ఇంటికి చేరవేస్తున్నాయి. వీటి సంఖ్యను మరో 230 కి పెంచి.. మొత్తం 500 సర్వీసులను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వాసుపత్రుల్లో నిత్యం 2 నుంచి 5 ప్రసవాలు జరిగేలా చూడటమే కాకుండా మాతా, శిశు ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పలు ప్రాంతాల్లో సర్వీసులు లేకపోవడంతో బాలింతలు ఆటోలు, బస్సులను ఆశ్రయించాల్సి వస్తున్నది. అది కూడా సొంత ఖర్చులతోనే ఇళ్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం జీవీకే ఈ సేవలను అందిస్తున్నది. జీవీకే కంపెనీ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండడంతో.. 104, 108 వాహనాల సేవలను నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా చేతికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు చేరనున్నాయి. ప్రస్తుతం ఈ ఎక్స్‌ప్రెస్‌లలో ఇద్దరు శిశువులను తరలిస్తుండటంతో.. ఇద్దరు బాలింతలు, వారితో ఉన్న ఇద్దరు అటెండర్లు ఒకే వాహనంలో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ ఇబ్బందులకు చెక్ పెట్టే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. 500 సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తే ఒక వాహనంలో ఒకే శిశువు, తల్లి, అటెండెంట్ వెళ్లేందుకు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా వెళ్లేందుకు వీలు కలుగుతుంది.
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..