India vs Afghanistan | ఇండియా నిర్దేశించిన 403 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆఫ్గనిస్తాన్ 71 రెండో వికెట్ కోల్పోయింది. 13.1 ఓవర్లో అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్(21) ప్రిన్స్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు గుర్నార్ సింగ్ బౌలింగ్‌లో గుర్బాజ్(41) పరుగులు చేసి అవుటయ్యాడు. 16.3 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్82 పరుగులు చేసింది. సెదిక్(19), రహ్మత్ (4) పరుగులతో ఆడుతున్నారు.
కాగా, టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ఇండియాను బ్యాంటింగ్‌కు ఆహ్వానిచింది. శుభ్‌మన్ గిల్( 154), ఇషాన్ కిషన్(125) సెంచరీలతో చేలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) త్వరగా అవుటయినప్పటికి కెప్టెన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.