అమరావతి : ఏపీ విద్యుత్‌శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) శనివారం ఏపీ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మంత్రులుగా ప్రమాణం చేసిన తరువాత ఇప్పటివరకు ఒకరిద్దరూ మినహా అందరు మంత్రులు బాధ్యతలు తీసుకోగా మిగిలిపోయిన వారిలో గొట్టిపాటి శనివారం కార్యాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై (Agriculture connections) తొలి సంతకం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరిపై రెండో సంతకం , పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇంటింటికి మూడు కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే దస్త్రంపై మూడో సంతకం చేశారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
ఐదేండ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపిందని విమర్శించారు. బాధ్యతలు స్వీకరించిన గొట్టి్పాటిని మంత్రి సత్యప్రసాద్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమాట్ల ధర్మరాజు, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులు తదితరులు అభినందనలు తెలిపారు.