అమరావతి : ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో పాటు ఎగువన నుంచి వస్తున్న నీటితో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని సుమారు 40 లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకు న్నాయి. గ్రామాల చుట్టూ వరద నీరు ఉండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. రోజువారీ జీవనం గడపడం కష్టతరంగా మారింది. లక్షకు పైగా జనాభా వరద బాధితులుగా ఉన్నారు.
కనీస అవసరాల కోసం కూడా మర పడవలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీకి జలాలు పోటెత్తుతున్నాయి. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద వరద స్థిరంగా ఉంది. స్పిల్వే ఎగువన 34,455 , దిగువన 26,325 మీటర్ల నీటి మట్టం కొనసాగుతు ఉంది. పోలవరం 48 గేట్ల ద్వారా 15,17,023 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పాత పోలవరం వద్ద వరద తాకిడికి నెక్లెస్ బండ్ కోతకు గురైంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1,05, 309 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్లం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 828.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 48.3290 టీఎంసీల నీరు నిల్వ ఉంది.