తిరుమల : తిరుమలలో శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి నిర్వహించిన గరుడ సేవ (Garudaseva) ఘనంగా ప్రారంభమయ్యింది. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన గరుడసేవ మాడవీధుల గుండా కొనసాగింది.
గరుడ సేవను ప్రత్యేకంగా తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం మాడ వీధుల్లో 231 గ్యాలరీలు నిండిపోయాయి. దీంతో శిలాతోరణం కూడలి నుంచి క్యూలైన్లోకి ప్రవేశించాలని టీటీడీ అధికారులు కోరుతున్నారు. భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు పంపిణీ చేశారు. గరుడిపై విహరిస్తున్న మలయప్పస్వామి ఊరేగింపు రాత్రి 11 గంటల వరకు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఏపీ ఆర్టీసీ 400 బస్సులను ఏర్పాటు చేసింది.