Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది పండగ మహోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చే కర్ణాటక కన్నడ భక్తులకు ఉదయం టీ పానీయాలు, అన్నదాన కార్యక్రమం, కన్నడ భక్తులు సేద తీరడానికి ఏర్పాట్లు చేశామని అన్నపూర్ణదేవి ఆశ్రమం, శివోహం టెంపుల్ ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కర్ణాటక నుండి నడిచి వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలతో అన్నపూర్ణ దేవి ఆశ్రమం కమిటీ సభ్యులు, శివోహం టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఉగాది పండుగ వరకు దిగ్విజయంగా నెరవేరుస్తామని ట్రస్టు నిర్వాహకులు అంతిరెడ్డి అరవిందరెడ్డి తెలిపారు.
భక్తులకు కల్పించే సౌకర్యాలు, అన్నదానానికి సహకరించిన దాతలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా అంతిరెడ్డి అరవిందరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సకల సంపదలతో విరజిల్లే విధంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారికి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ, ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే సద్గురు సనారీ విశ్వేశ్వర స్వామి శ్రీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఉండాలని ఆ మహా దేవుడ్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు.