హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేశారు. తెలంగాణ విధానమే సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన క్యాబినెట్ భేటీ లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు, కొత్త ఇసుక పాలసీ, ఇతర ప్రతిపాదనలకు మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర వేశారు.
టీటీడీ జేఈవోగా వెంకయ్య చౌదరి
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా 2005 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్‌పై ఏపీకి పంపేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. ఆయన డిప్యూటేషన్‌పై మూడేండ్ల పాటు పనిచేయనున్నారు.