అమరావతి : చర్లపల్లి-షాలీమార్ రైలు(Charlapalli-Shalimar train) ఢీ నలుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా(Eluru district) ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఓ యువకుడు ఉన్నాడు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
కాగా, మరో ఘటనలో విశాఖపట్నం(Visakhapatnam) నుంచి బోటులో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు(Seven fishermen) తుఫాను ప్రభావంతో గల్లంతయ్యారు. ఈ నెల 1న ఏడుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కుటుంబ సభ్యులు వారికి ఈ విషయాన్ని చేరవేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటికి చేరుకుంటామని ఫోన్ చేసి చెప్పారు. శనివారం సాయంత్రం వరకు వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేయడంతో ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి.
దీంతో కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు గల్లంతైన జాలర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందినవారు ఆరుగురు ఉండగా, మరొకరు భీమిలి మండలం పెదనాగమయ్యపాలెం వాసిగా గుర్తించారు. గల్లంతైన జాలర్లలో కే. సీతడు, గరగయ్య, బండియ్య, అమర అప్పలరాజు, మెడ చిన్న అమ్మెరు, కారి చిన్న, కె. చిన్నయ్య ఉన్నారు.