Road Accident | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై ఓ లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన అంబులెన్స్ కోల్కతా నుంచి బెంగళూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది.