AP High Court | ఏపీ హైకోర్టులో నలుగురు అదనపు జడ్జిలకు పదోన్నతి లభించింది. జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లు పూర్తి స్థాయి న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు వెలువరించింది.
ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లోని 16 మంది హైకోర్టు న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు చేసింది. దీనికి తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలిపడంతో కేంద్ర న్యాయ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.