హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు (Ravela Kishore Babu) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్కు రాజీనామా లేఖ పంపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వైసీపీతోనే సాధ్యమని పార్టీలో చేరానని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీని ప్రజలు తిరస్కరించారని అందులో పేర్కొన్నారు. ఎస్పీ వర్గీకరణ కోసం కృషి చేసేందుకు వైసీపీని వీడుతున్నట్లు వెల్లడించారు.
సంక్షేమం, సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని కూటమికి చారిత్రక విజయం సాధించిపెట్టారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సమర్ధవంతంగా పనిచేసి పేద ప్రజలకు సేవచేశానని తెలిపారు. దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల టీడీపీలో కొనసాగలేకపోయానని చెప్పారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వస్తున్నాని తెలిపారు.