అమరావతి : టీడీపీ సీనియర్‌నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(72) గుండెపోటుతో మృతి చెందారు. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేర్కొందిన బొజ్జల చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఇవాళ అస్వస్థతకు గురై అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని హుటాహుటిన అపోలో చేర్పించారు. ఆస్పత్రిలో డాక్టర్లు సీపీఆర్ ద్వారా చికిత్స అందించినప్పటికి ఆయన తుదిశ్వాస విడిచారు.
గత జనవరి నెలలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన భార్య ఇద్దరు కొవిడ్‌బారిన పడ్డారు. చికిత్స అనంతం వారు కోలుకున్నారు. తిరుమల అలిపిరి వద్ద నక్సలైట్లు క్లైమోర్ మందుపాతర పేల్చిన ఘటనలో చంద్రబాబుతో సహ బొజ్జల గాయపడ్డారు.