అమరావతి : వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై జాప్యం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ మాజీ మంత్రి అంబటిరాంబాబు (Ambati Rambabu) పట్టాభిపురం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా(Dharna) నిర్వహించారు. సోషల్మీడియాలో వైసీపీ (YCP) నాయకులపై కూటమికి చెందిన నాయకులు అసత్యప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గత నెల 19వ తేదీన ఫిర్యాదులు (Complaints) ఇచ్చామని తెలిపారు.
చట్ట ప్రకారం పోలీసులు 14రోజుల్లో చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వహించాలని కోరారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులను పక్కన పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ? లేదా? అంటూ నిలదీశారు. మరో రెండురోజుల్లో తీసుకున్న చర్యలను వివరించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కూటమి నాయకులకు ఒక న్యాయం, తమకో న్యాయమా అంటూ మండిపడ్డారు.