తిరుమల : మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు ( Vidyasagar Rao ) తిరుమలలో ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం దర్శనానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శాలువతో సన్మానించారు.
#WATCH | Tirupati, Andhra Pradesh | Former Governor of Maharashtra, C Vidyasagar Rao visits and offers prayers at Sri Venkateswara Temple in Tirumala. pic.twitter.com/yFXG44e9Y7
— ANI (@ANI) January 30, 2025
ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళం
తిరుపతికి చెందిన బ్లిస్ హోటల్స్ గ్రూప్ చైర్మన్ ఎం. సూర్యనారాయణ రెడ్డి దంపతులు టీటీడీ (TTD) ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్ కు రూ.10,00,116 విరాళాన్ని ( Donation ) గురువారం అందించారు. ఈ సందర్భంగా చెక్‌ను టీటీడీ అదనపు ఈవోసిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుమలలోని అడిషనల్ ఈవో క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి.భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.