అమరావతి : భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ (Former Cricketer Kapildev ) విజయవాడలోని ఉండవల్లిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేశినేని చిన్నితో కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో గోల్ఫ్ కోర్టు(Golf court) ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. అనంతరం కపిల్‌దేవ్ మీడియాతో మాట్లాడారు.
క్రీడలపై కూడా సీఎంకు చాలా ఆసక్తి ఉందని కపిల్‌దేవ్ పేర్కొన్నారు.తాను ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నానని వివరించారు. చంద్రబాబుతో జరిగిన సమావేశంలో గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగిందని, గోల్ఫ్‌కు ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వానిదే నిర్ణయమని అన్నారు. స్టోర్ట్స్ సిటీ(Sport City) ఇస్తే చాలా సంతోషిస్తానని వెల్లడించారు.
ఎంపీ కేశినేని చిన్ని(MP Kesineni Chinni) మాట్లాడుతూ అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ఫ్ కోర్స్‌లు పెడతామని, డ్రైవింగ్ రేంజ్‌లు సిద్ధం చేస్తామని తెలిపారు. ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరామని పేర్కొన్నారు. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తామని, గ్రామీణ క్రికెట్ క్రీడాకారులను వెలికితీస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ ఎయిర్‌పోర్టులో ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కపిల్‌దేవ్‌కు స్వాగతం పలికారు.