చెప్పుతో కొట్టుకున్న ఏపీ మాజీ మంత్రి..
former minister| ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వైసీపీ నాయకుల మధ్య విబేధాలు రోడ్డెక్కాయి. నరసాపురం జిల్లా కేంద్రం
అమరావతి: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వైసీపీ నాయకుల మధ్య విబేధాలు రోడ్డెక్కాయి. నరసాపురం జిల్లా కేంద్రం తరలిపోవడానికి స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే కారణమంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు తన చెప్పుతోనే తానే కొట్టుకోవడం సంచలనం కలిగించింది. న రసాపురం జిల్లా కేంద్రం కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించిన నాయకులు అంబేద్కర్ కూడలిలో సభను నిర్వహించారు.
సభలో మాట్లాడిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఎమ్మెల్యే ముదనూరి ప్రసాద్‌రాజు ( వైసీపీ )తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో తాను అసమర్ధుడ్ని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పు చేశానని, నర్సాపురంలో జిల్లా కేంద్రం సాధించటంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని, అతడిని ఎమ్మెల్యేగా గెలిపించి తప్పుచేశానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఆవేదన చెందుతూ తన చెప్పుతో చెంపపై కొట్టుకోవడం విస్మయం కలిగించింది. నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే ప్రజలను మోసం చేశారని కొత్తపల్లి ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై పలు జిల్లాల్లో జిల్లా కేంద్రాల ఏర్పాటు, పేర్లతో పాటు ఇతరత్రా డిమాండ్ల విషయమై ఆందోళనలు సాగుతున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

